![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1108 లో....రిషి వసుధార దగ్గరికి వచ్చి.. నేనే రిషి అని చెప్పి డాడ్ ని చూడాలని ఉంది పదా అని చెప్తాడు. అలా అనగానే పదండి అంటూ వసుధార తనని తీసుకొని వెళ్తున్నట్లు వసుధార కల కంటుంది. రిషి సర్ అనగానే అందరు నిద్రలేస్తారు. ఏమైందని పెద్దావిడ అడుగుతాడు. రిషి సర్ అని వసుధార అనగానే రంగానా అక్కడే ఉన్నాడని చెప్తుంది. నువ్వు లోపలికి వెళ్లి పడుకోమని వసుధారని పెద్దావిడ పంపిస్తుంది.
ఆ పిల్లకి తన భర్త అంటే ఎంత ఇష్టమో అని పెద్దావిడ అంటుంది. అవును తన భర్త చాలా అదృష్టవంతుడని రంగా అంటాడు. ఏంటి అన్న అంత ఫీల్ అయిపోతున్నావ్.. కొంపదీసి నువ్వేనా ఆ రిషి సర్ వి అని తన ఫ్రెండ్ అడుగగా.. అదేం లేదని రంగా అంటాడు. మరొకవైపు మనుకి ఏంజిల్ ఫోన్ చేసి మాట్లాడాలి రమ్మని చెప్తుంది. నేను రానని మను అంటాడు. నువ్వు జస్ట్ ఇంటి బయటకు వస్తే చాలు.. నేను ఇంటి ముందే ఉన్నానని ఏంజిల్ అనగానే.. మను బయటకు వస్తాడు. ఏంటి ఎందుకు రమ్మన్నావని మను అడుగుతాడు. నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉందని ఏంజిల్ అనగానే.. ఇప్పుడేంటని మను అంటాడు. నాకు తినాలని ఉందనగానే నేను రానని మను అంటాడు. నువ్వు ఎలా రావో నేను చూస్తానంటూ ఏంజిల్ అత్తయ్య అని గట్టిగా పిలుస్తుంది. ఏయ్ వద్దని చెప్పి మను ఏంజిల్ తో వెళ్తాడు. తాతయ్య నాకు పెళ్లి చెయ్యాలనుకుంటున్నాడు. ఒకసారి ఇలాగే అన్నప్పుడు రిషిని చేసుకోవాలనుకున్నానని అప్పుడు జరిగింది మొత్తం చెప్తుంది. అయితే ఇప్పుడు ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావని మను అనాగనే.. కొంచెం ఆలోచిస్తే తెలుస్తుందని ఏంజిల్ అంటుంది.
ఆ తర్వాత శైలేంద్ర కొంతమంది స్టూడెంట్స్ కి డబ్బులు ఇచ్చి.. శైలేంద్ర ఎండీ అవ్వాలంటూ చెప్పమని అంటాడు. అప్పుడు శైలేంద్ర ఎండీ అవ్వాలంటూ స్టూడెంట్స్ అరుస్తుంటే.. మను వచ్చి మీలో కొంతమందికి డబ్బులు తక్కువ ఇచ్చాడని అనగానే.. వాళ్ళు కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మను దగ్గరికి ఏంజిల్ వచ్చి బయటకు వెళదామని అంటుంది. అప్పుడే శైలేంద్ర వచ్చి ఇది మా కాలేజీ మీరు ఇక్కడేం చేస్తున్నారని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |